బద్ధకస్తుడన్నారు.. హిట్ మ్యాన్‌గా రోహిత్ ఇలా మారాడు!
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాక రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా, వైస్ కెప్టెన్‌గా ఎదిగాడు. HitMan Rohit Sharma Birthday
HitMan Rohit Sharma Birthday | నేడు (ఏప్రిల్ 30న) భారత క్రికెటర్ రోహిత్ శర్మ పుట్టినరోజు. లాక్‌డౌన్ టైమ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాక రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా, వైస్ కెప్టెన్‌గా ఎదిగాడు. కూల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు రికార్డు స్థాయిలో 4 పర్యాయాలు ట్రోఫీ అందించాడంటే అతడి నాయకత్వ పటిమ ఏంటన్నది అర్థమవుతోంది. రెండేళ్ల కిందటే తన మరణంపై ఇర్ఫాన్ జోస్యం!
వన్డేల్లో డబుల్ సెంచరీ చేయకుండానే ఎంతో మంది దిగ్గజాలు సైతం రిటైర్ కాగా, రోహిత్ శర్మ మాత్రం మంచినీళ్లు తాగినట్లుగా 3 ద్విశతకాలు సాధించాడు. టీ20లలో నాలుగు శతకాలు బాదేశాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ రోహిత్. జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఆరేళ్లపాటు శ్రమించాడు. ఇప్పుడు అతడు లేకుండా జట్టును ప్రకటించే సాహసం చేయరు. Pics: హాట్ ఫొటోలతో కవ్విస్తోన్న శ్రియ
[[{"fid":"185015","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
2007 జూన్‌లో జాతీయ జట్టులోకి వచ్చినా సరైన ఇన్నింగ్స్‌లు లేని కారణంగా 2011 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు. ఆపై అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని హిట్ మ్యాన్‌గా నిలిచాడు. అయితే వన్డే ప్రపంచ కప్ సాధించాలన్న కల కలగానే మిగిలిందన్న బాధ రోహిత్‌ను కలచివేస్తోంది. కేవలం గత ఆరేళ్ల వ్యవధిలోనే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!
రోహిత్ సాధించిన కొన్ని అరుదైన ఘనతలు..
- ఒక వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు (5) చేసిన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ.
- వన్డే వరల్డ్ కప్ ఛేజింగ్‌లో అత్యధిక శతకాలు (3) చేసిన క్రికెటర్ హిట్ మ్యాన్.
- ఇంగ్లాండ్ గడ్డ మీద హ్యాట్రిక్ శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్. 2019 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా రోహిత్ ఈ ఫీట్ సాధించాడు.
- వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్ (264)దే. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్.
- సిక్సర్‌తో అన్ని ఫార్మాట్లలో శతకం సాధించిన ఏకైక క్రికెటర్. వన్డేల్లో 3, టెస్టుల్లో 2, ఓ టీ20 శతకాన్ని సిక్స్ కొట్టి నమోదుచేశాడు.
- టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకం బాదిన తొలి బ్యాట్స్‌మెన్ రోహిత్.
- 2013 నుంచి 2019 మధ్య కాలంలో ప్రతి క్యాలెండర్ ఏడాదిలో వన్డే ఫార్మాట్‌లో 50కి పైగా బ్యాటింగ్ సగటు నమోదు చేశాడు. 500 లేక అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏ క్రికెటర్ వరుసగా ఏడేళ్లు ఈ ఫీట్ సాధించలేదు.
- 2019లో 10 శతకాలు బాదాడు. అయితే ఓ క్యాలెండర్ ఏడాదిలో 7 జట్లపై శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు.
- 10 దేశాలలో 50 లేక అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్ స్కోర్ చేసిన ఏకైక ఆటగాడు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, అమెరికా దేశాల గడ్డ మీద ఈ ఫీట్ సాధించాడు.
- అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక భారత ఓపెనర్ రోహిత్ శర్మ. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!